మన టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ కనకాల వారసుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ’. అయితే ఈ సినిమాలో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరి ఈ టీజర్ లో యంగ్ హీరో రోషన్ కనకాల మరోసారి అదరగొట్టగా తనతో పాటుగా బండి సరోజ్ అభిమానులు కూడా టీజర్ ని వీక్షించారు. మరి ఈ టీజర్ కి వచ్చిన కామెంట్స్ విషయంలో సరోజ్ ఇపుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. తనకి పాజిటివ్ గా వచ్చిన టాప్ కామెంట్స్ ని మేకర్స్ అడ్మిన్ తొలగించడం బాలేదు అని సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
తాను ఈ సినిమా కోసం చాలా కమిటెడ్ గా వర్క్ చేస్తున్నాను కానీ అందుకు తిరిగి దక్కిన ప్రతిఫలం ఇది అంటూ విచారం వ్యక్తం చేసాడు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు దీనిని పరిగణలో తీసుకోవాలని ఆశిస్తున్నట్టుగా తాను తెలిపాడు. మరి ఈ టాలెంటెడ్ నటుడు విషయంలో ఎలాంటి యాక్షన్ ఉంటుంది అనేది చూడాలి.