పరిశ్రమ లో వస్తున్న తాజా సమాచారం ప్రకారం హిందీలో భారీ విజయం సాదించిన చిత్రం “బ్యాండ్ బజావో భారత్” చిత్రం త్వరలో తెలుగు రీమేక్ కానుంది. యష్ రాజ్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం తెలుగు ,తమిళ మరియు కన్నడ లో కూడా నిర్మించాలని యోచిస్తున్నారు. ఆదిత్య చోప్రా స్థాపించిన వై ఆర్ ఎఫ్ దక్కన్ సంస్థ దక్షిణం లో వారి మార్కెట్ ను పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. “బ్యాండ్ బజావో భారత్” ఈ సంస్థ నుండి రాబోతున్న మొదటి చిత్రం కానుంది. నూతన నటీ నటుల కోసం వెతుకులాట మొదలయ్యింది. ఈ చిత్రాలకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది ఇంకా తేలలేదు. ఆసక్తికరమయిన విషయం ఏంటంటే బాలివుడ్ నిర్మాణ సంస్థలు యష్ రాజ్ ఫిల్మ్స్ ,యుటివి మరియు రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ వంటి పెద్ద సంస్థలు ఇలా తెలుగు, తమిళ మార్కెట్ లో అడుగు పెట్టడం శుభపరిణామం ఇక్కడి మార్కెట్ మీద వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.