నానాక్రాంగూడలో బలుపు సినిమా షూటింగ్

Balupu1
రవితేజ నటిస్తున్న ‘బలుపు’ సినిమా షూటింగ్ చివరి దశలోవుంది. ఇటీవలే బ్యాంకాక్లో ఒక షెడ్యూల్ ముగించుకుని, అక్కడే రవితేజ, లక్ష్మిరాయ్ ల నడుమ ఒక పాటను కూడా తీసారు. ప్రస్తుతం రవితేజ, శృతి హాసన్ నడుమ కొన్ని సన్నివేశాలను నానాక్రాంగూడ దగ్గర చిత్రీకరిస్తున్నారు. అంజలి మరో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గోపిచంద్ మలినేని దర్శకుడు. ప్రసాద్ పోట్లురి నిర్మాత. రవితేజ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ద్వారా ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియోను జూన్ 1న, సినిమాను జూన్ 21 విసుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version