రవితేజ పుట్టిన రోజున బలుపు ఫస్ట్ లుక్

రవితేజ పుట్టిన రోజున బలుపు ఫస్ట్ లుక్

Published on Jan 18, 2013 11:58 PM IST

raviteja
రవితేజ రానున్న చిత్రం “బలుపు” ఫస్ట్ లుక్ అధికారికంగా జనవరి 26న విడుదల కానుంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం చిత్రీకరణ పూర్తయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ మూవీస్ బ్యానర్ మీద ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పూర్తి మాస్ పాత్రలో కనిపించనున్నారు. శృతి హసన్ మరియు అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో రవితేజ మరియు శృతి హసన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరించారు. బ్రహ్మాజీ మరియు బ్రహ్మానందం చిత్రంలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

తాజా వార్తలు