రవితేజ, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ‘బలుపు’ సినిమా ఈ నెల 28న మనముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాను జూన్ 21న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఒక వారంపాటు వాయిదా వేసారు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. పోట్లురి వి ప్రసాద్ ఈ సినిమాను పి.వి.పి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రవితేజ రెండు విభిన్న ఛాయలున్న మాస్ పాత్రలలో కనిపించనున్నాడు. అంజలి ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. ఇటీవల జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “రవితేజ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇందులో యాక్షన్ సీన్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని”తెలిపాడు. ఈ సినిమాలో మొదటిసారిగా శృతి హాసన్ పూర్తి గ్లామర్ రోల్ చేస్తుంది. ఆమె పాత్ర అందిరినీ నవ్విస్తుంది. కొన్ని పాటలను పోర్చుగల్ లో తీసినా ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగం హైదరాబాద్, వైజాగ్ లలోనే జరుపుకుంది. థమన్ సంగీతాన్ని అందించాడు.