దీపావళి తర్వాత బలుపు మొదలవుద్ది

మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కనున్న ‘బలుపు’ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ‘డాన్ శీను’ మరియు ‘బాడీగార్డ్’ సినిమాలకు డైరెక్షన్ చేసిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన శ్రుతి హసన్ మరియు అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. కొద్ది రోజుల క్రితం లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణకి ఎలాంటి అడ్డంకులు రాకపోతే 2013 సమ్మర్లో విడుదల చేస్తారు. ఈ సినిమాలో కామెడీకి ప్రధానం ఉన్న పాత్రని శ్రుతి హాసన్ పోషిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత శ్రుతి హాసన్ తెలుగులో ఒప్పుకున్నా సినిమా ఇదే. రవి తేజ మరియు శ్రుతి హాసన్ జోడీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి మరి.

Exit mobile version