మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ఎంటర్టైనర్ సినిమా ‘బలుపు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హసన్ ఈ సినిమాలో గ్లామరస్ అవతారంలో కనిపించనుంది. అంజలి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పాత్రలో పూర్తి మాస్ గా కనిపించనున్నాడు. గడ్డంతో, పంచ్ డైలాగులతో సినిప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీవీపీ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.