సూపర్ హిట్ దిశలో దూసుకుపోతున్న బలుపు

సూపర్ హిట్ దిశలో దూసుకుపోతున్న బలుపు

Published on Jun 30, 2013 9:40 PM IST

Balupu1
మాస్ మహారాజ్ రవితేజ, శృతి హాసన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘బలుపు’ సినిమా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ దిశలో దూసుకుపోతోంది. మాన రాష్ట్రం మొత్తం మీద ఈ చిత్రం యొక్క మూడు రోజుల కలెక్షన్స్ చాలా బాగున్నాయని సమాచారం. అమెరికాలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు వస్తున్నాయి. ‘మిరపకాయ్’ సినిమా తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ తెచ్చుకున్న రవితేజ సినిమా ఇదే కావడం విశేషం. ఈ ‘బలుపు’ సినిమా చాలా తక్కువ టైంలోనే ‘మిరపకాయ్’ కలెక్షన్స్ ని క్రాస్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని పివిపి సినిమా బ్యానర్ వారు నిర్మించారు. అంజలి, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు