“అన్నపూర్ణ తల్లి బువమ్మ” షూటింగ్ పూర్తి – గుమ్మడికాయ వేడుకలో బాలినేని

“అన్నపూర్ణ తల్లి బువమ్మ” షూటింగ్ పూర్తి – గుమ్మడికాయ వేడుకలో బాలినేని

Published on Aug 12, 2025 5:34 PM IST

Annapurna Thalli Bhuvamma

సముద్ర, శివిక, కుసుమ, సుప్రియా, నవీన్ మట్టా, రోహిల్, ఆదిల్, రూపేష్ ముఖ్య పాత్రల్లో నటించిన “అన్నపూర్ణ తల్లి బువమ్మ” చిత్రం షూటింగ్ పూర్తయింది. గోరి బ్రదర్స్ మీడియా, బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ బ్యానర్లపై సిరాజ్ ఖాదరన్ గోరి నిర్మాణంలో, సురేశ్ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గుమ్మడికాయ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్ ప్రభు, సాయి విజయేందర్ సింగ్ తదితరులు హాజరై, బాలినేని టీమ్‌కు జ్ఞాపికలు అందజేశారు.

బాలినేని మాట్లాడుతూ, “అన్నపూర్ణమ్మగా పేరుగాంచిన డొక్కా సీతమ్మగారి సేవలను అందరికీ తెలిసేలా చేయడం ఆనందం. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఒంగోలులో సీతమ్మగారి పేరుతో అన్నదానం ప్రారంభిస్తాను. ఇలాంటి ఆదర్శ వ్యక్తుల కథలు సమాజానికి అవసరం; ఈ చిత్రం తప్పక విజయం సాధించాలి” అన్నారు.

సీతమ్మగా నటించిన శివిక, “ఇది నా తొలి చిత్రం; ఇంత మంచి పాత్ర, మంచి టీమ్ దక్కడం అదృష్టం” అని చెప్పారు. వి. సముద్ర, “సీతమ్మగారి జీవితకథను చెప్పే ఈ సినిమా నిర్మాతలకు గర్వకారణం అవుతుంది. సీతమ్మ భర్తగా నటించడం నాకు భాగ్యం; దర్శకుడు సురేశ్ చక్కగా తీశారు” అని అన్నారు.

దర్శకుడు సురేశ్ లంకలపల్లి, “మంచి టీమ్ దొరికింది. మా పని తెరపై మాట్లాడుతుందని నమ్మకం” అన్నారు. నిర్మాతలు, “షూటింగ్ పూర్తయింది, గుమ్మడికాయ కొట్టేశాం. త్వరలో పోస్ట్-ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదలకు తీసుకువస్తాం” అని తెలిపారు.

తాజా వార్తలు