నేడే బాలయ్య ‘కల్కి’ సినిమాకి ముహూర్తం

నేడే బాలయ్య ‘కల్కి’ సినిమాకి ముహూర్తం

Published on Feb 6, 2012 11:40 AM IST

నందమూరి బాలకృష్ణ నటించబోయే కొత్త చిత్రం ‘కల్కి’ ఈ రోజు అన్నపూర్ణ స్టుడియోలో ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ముహూర్త షాట్ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి రవికుమార్ చావాలి దర్శకత్వం వహిస్తుండగా రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకక్కనున్న ఈ చిత్ర స్క్రిప్ట్ కూడా బాగా వచ్చినట్లు సమాచారం. బాలయ్య సరసన పార్వతి మెల్టన్ హీరొయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘అధినాయకుడు’ చిత్రీకరణ పూర్తయిన వెంటనే మార్చిలో కల్కి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

తాజా వార్తలు