నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం మూసాపేట్ ఏరియాలో షూట్ చేస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ అదే లొకేషన్ లో రేపు కూడా షూటింగ్ చేయనున్నారు. బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.
షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్న ఈ సినిమాని 2014లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా బాలకృష్ణకి చాలా కీలకం కానుంది, 2014 ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యే బాలయ్య చివరి సినిమా ఇది. ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ మరియు కాస్త పొలిటికల్ టచ్ ఉంటుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరొక హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉన్న ఈ సినిమాలో జగపతి బాబు నెగటివ్ రోల్లో కనిపించనున్నాడు. ఈ మూవీని సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.