చాలా గ్రాండ్ గా జరిగిన బాలయ్య కుమార్తె వివాహం

చాలా గ్రాండ్ గా జరిగిన బాలయ్య కుమార్తె వివాహం

Published on Aug 21, 2013 11:30 AM IST

Balayya's-daughter's-weddin
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తెజశ్విని వివాహ మహోత్సవం ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని హైటెక్స్ లో చాలా గ్రాండ్ అండ్ స్టైలిష్ గా జరిగింది. ఈ వివాహానికి చాలా మంది వివిఐపిలు మరియు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, డా. మోహన్ బాబు, డా. దాసరి నారాయణరావు, కృష్ణ, విజయనిర్మల, వెంకటేష్, జగపతిబాబు, శ్రీ కాంత్, మురళి మోహన్, ఈనాడు చైర్మెన్ రామోజీ రావు, ఎబిఎన్ చైర్మెన్ రాధ కృష్ణ, తరుణ్, శివాజీరాజా తదితరులు హాజరయ్యారు.

అలాగే చాలా మంది రాజకీయ నాయకులూ కూడా విచ్చేశారు. దాదాపు నందమూరి ఫ్యామిలీ లోని అందరూ ఈ వివాగా వేడుకకి విచ్చేసి దగ్గరుండి ప్రత్యేకంగా అక్కడి ఏర్పాట్లు చోసుకున్నారు. ఆ వివాహ మహోత్సవానికి సంబందించిన ఫోటోలను మా గ్యాలరీలో చూడండి.

తాజా వార్తలు