బాలయ్య-బోయపాటి మూవీ లేటెస్ట్ అప్డేట్

హిట్ కాంబినేషన్ బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ మొదలుకావాల్సివుండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ నిలిపివేయాలంటూ చిత్ర పరిశ్రమ నిర్ణయించిన తరుణంలో గ్యాప్ ఇచ్చారు. మార్చి 31వరకు షూటింగ్స్ పై నిషేధం ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారం నుండి సెకండ్ షెడ్యూల్ మొదలుకానుందిట.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా శ్రేయా, అంజలీ నటిస్తున్నారని సమాచారం. వీరిద్దరు కూడా సెకండ్ షెడ్యూల్ నుండి జాయిన్ కానున్నారట. గత ఏడాది బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్స్ అలాగే రూలర్ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వని తరుణంలో ఫ్యాన్స్ ఈ హిట్ కాంబినేషన్ పై చాల ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా మిర్యాల రవీంద్ర రెడ్డి వ్యవహరిస్తున్నారు.

Exit mobile version