విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య బాబుని మరోసారి పవర్ ఫుల్ పాత్రలో చుపించానున్నాడు. ప్రస్తుతం ట్రెయిన్ ఫైట్ సన్నివేశాలను బాలకృష్ణ మరియు కొంతమంది నటులతో తెరకెక్కిస్తున్నారు
యాద్రుచికంగా ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ సినిమాలలో కొన్ని సీన్ లు రైల్వే స్టేషన్ లో తీసారు. ఆ సన్నివేశాలు సినిమాకే హై లైట్ అయ్యాయి. మరోసారి బోయపాటి ఈ మ్యాజిక్ ని చుపిస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో రాధికా ఆప్టే,సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ హీరోయిన్స్
ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు