“డాకు మహారాజ్” ఓటిటి డేట్ వచ్చేసింది!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే బిగ్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా కూడా రాజపోవడం ఫ్యాన్స్ కి కూడా ఒకింత ఆశ్చర్యంగా మారింది.

అయితే ఇపుడు ఫైనల్ గా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న డేట్ వచ్చేసింది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ చేసుకున్న ఈ సినిమా అందులో ఈ ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఆరోజుకి అంతా సిద్ధం అయిపోతే సరిపోతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు అలాగే ఈ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version