నటసింహం బాలయ్య ఫ్యాన్స్ ఏమైనా తాము ప్రత్యేకం అని నిరోపించుకున్నారు. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పి తమ వీరాభిమానం చాటుకున్నారు. ఈనెల 10న బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీనితో షష్టి పూర్తి చేసుకున్న బాలయ్య జన్మదినానన్ని ఘనంగా జరపాలని ఫ్యాన్స్ భావించారు. ఐతే కరోనా నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించరాదని, తనని కలవడానికి ఎవరూ రావద్దని బాలయ్య అభిమానులకు పిలుపునిచ్చాడు.
కాగా జూన్ 10న ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లుకు ఏక కాలంలో 21 వేల కేక్‌లను బాలకృష్ణ ఫ్యాన్స్ కట్ చేశారు. వరల్డ్ వైడ్ గా ఉన్న బాలయ్య ఫ్యాన్స్ వివిధ దేశాలలో ఈ వేడుక నిర్వహించగా, దాదాపు 80 వేల మంది అభిమానులు పాల్గొన్నారు. ఈ వేడుకను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పర్యవేక్షించి వరల్డ్ రికార్డుగా అనౌన్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు కుదుటపడ్డ తర్వాత.. సంబంధిత పత్రాలను బాలకృష్ణకు స్వయంగా అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.