బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి చేసుకుందట. అయితే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు.. మరి బర్త్ డే స్పెషల్ గా బాలయ్య ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తారా ? లేదా ? అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘బాలయ్య – గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్. మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో.
ఇక ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాశారు. బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే పూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.