ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా తర్వాత దర్శకుడు తన వీర సింహా రెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ 111వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అనౌన్సమెంట్ తోనే సాలిడ్ బజ్ ని సొంతం చేసుకోగా మేకర్స్ ఫైనల్ గా సాలిడ్ అప్డేట్ ఇప్పుడు అందించారు.
దీని ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ నేటి నుంచే ముహూర్త కార్యక్రమాలతో మొదలు అయినట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై రిలీజ్ చేసిన ఓ పోస్టర్ కూడా మంచి ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా క్లియర్ హా తెలుస్తుండగా రెండు పవర్ఫుల్ లుక్స్ కనిపిస్తున్నాయి.
ఇక దీనితో పాటుగా ఇద్దరూ వారియర్ లుక్ లోనే కనిపిస్తుండగా ఒకరు పూర్తిగా యుద్ధ యోధునిగా కనిపిస్తుంటే మరొకరు షర్ట్ లేకుండా రుద్రాక్ష మాలలతో కనిపిస్తున్నారు. అలాగే ఇద్దరూ రెండు భిన్నమైన కోటలపై కూడా కనిపిస్తున్నారు. మరి ఇదంతా చూస్తుంటే గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
