నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ఈ సినిమా టీం విదేశీ షెడ్యూల్ల బాగంగా త్వరలో బ్యాంకాక్ వెళ్లనుంది. ఎప్పుడు వెళ్ళేది అనే విషయమపై ఇంకా కచ్చితమైన నిర్ణయం వెలువడలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ టీం రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణని పవర్ ఫుల్ గా చూపించనున్నారు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.