షూటింగ్లో బాలకృష్ణకి చిన్న గాయం

షూటింగ్లో బాలకృష్ణకి చిన్న గాయం

Published on Nov 6, 2013 4:30 PM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ రోజు వచ్చిన టీవీ రిపోర్ట్స్ ప్రకారం బాలయ్యకి ఈ రోజు షూటింగ్ సమయంలో చిన్న గాయమైంది. వెంటనే ఆయన్ని ఓ కార్పోరేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసారు. ఆ తర్వాత డాక్టర్స్ ఎలాంటి ప్రమాదం లేదని తెలపడంతో ఆయన తిరిగి మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడు.

బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ‘లెజెండ్’ సినిమాని నిర్మిస్తున్నారు. 2014 మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు