బాలయ్య గొప్ప మనసు..జేపీ కుటుంబానికి ఆర్ధిక సాయం!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఆన్ స్క్రీన్ ఎంత ఫైర్ గా కనిపిస్తారో ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మనసు బంగారం అని అభిమానులు చెప్పుకుంటారు. అలాగే బాలయ్య చేసిన ఎన్నో భారీ హిట్ చిత్రాల్లో కీలక పాత్ర పోషించి సిసలైన హీరో విలన్లు అంటే ఇలాగే ఉండాలేమో అని ఒక బెంచ్ మార్క్ నుసెట్ చేసుకున్న కాంబో బాలయ్య – జయప్రకాష్ రెడ్డి గార్ల కాంబో.ఈ ఇద్దరి కాంబో అంటేనే అసలైన హీరోయిజం మరియు విలనిజాలు కనిపిస్తాయి.

అలాంటిది నిన్న ఉదయం జేపీ గారు ఇక లేరు అని వార్త బయటకు రావడంతో దేశ ప్రధాని సైతం ఆయనపై ట్వీట్ చేసేంత వరకు ఆయన మరణ వార్త వెళ్ళింది. ఎందరో సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అందించారు. కానీ బాలయ్య ఒకడగుడు ముందుకేసి జేపీ గారి కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారన్న వార్త రావడంతో బాలయ్య అభిమానులు మరోసారి అతని గొప్ప మనసు కోసం మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం మన టాలీవుడ్ ఎందరు హీరో మరియు విలన్ ల కాంబోలు వచ్చినప్పటికీ వీరిద్దరి కాంబో మాత్రం చిరస్థాయిగా ఉండిపోయే కాంబో.

Exit mobile version