లెజెండ్ పై పూర్తి నమ్మకంతో ఉన్న బాలకృష్ణ

లెజెండ్ పై పూర్తి నమ్మకంతో ఉన్న బాలకృష్ణ

Published on Dec 11, 2013 8:15 AM IST

legend
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ‘లెజెండ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెడీ అవుతున్న విషయంలో బాలకృష్ణ ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే బాలకృష్ణ ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు మరియు బాలయ్య ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు.

ఈ సినిమా కోసం బాలయ్య బరువు తగ్గడమే కాకుండా ఈ సినిమా కోసం కొన్ని రిస్క్ తో కూడుకున్న సీరియస్ ఫైట్స్ కూడా చేస్తున్నాడు. లెజెండ్ సినిమా 2014 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు