క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్న లెజెండ్

Legend_First_Look1

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ, తదితర ప్రముఖ నటీనటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు.

బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం – 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘సింహా’ సినిమా తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం వాళ్ళ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version