‘మొండోడు’ లోగో ఆవిష్కరించిన శ్రీనువైట్ల

‘మొండోడు’ లోగో ఆవిష్కరించిన శ్రీనువైట్ల

Published on Jul 1, 2013 7:36 PM IST

Mondodu--(2)

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మొండోడు’. ఈ సినిమా లోగోని ఈరోజు హైదరాబాద్ ఎఫ్.ఎన్.సీ.సీలో ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఆవిష్కరించారు. రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు ప్రభు మాట్లాడుతూ ‘యాక్షన్, సెంటిమెంట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచికోసం ఒక మనిషి చేసే ప్రయత్నమే కథని’ అన్నాడు.

తాజా వార్తలు