బాలయ్య సినిమా పై వాస్తవం లేదట !

బాలయ్య బాబు – బి.గోపాల్ కలయికలో రాబోతున్న సినిమా కథ పై సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తున్నాయి. తండ్రి ప్రేమను అర్ధం చేసుకోలేని కూతురు సెంటిమెంట్ తో సాగే ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని, మెయిన్ గా ఏభై ఏళ్ల వయసు ఉన్న ఓ పోలీస్ గా బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడని ఆ రూమర్స్ సారాంశం. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట.

రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారట. ఇక ప్రస్తుతం బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య అంటేనే.. యాక్షన్, ఆ యాక్షన్ కి ఎమోషన్ కూడా తోడైతే హిట్ గ్యారంటీ. ఈ సినిమాలో ఎమోషన్ కూడా బాగుంటుందట.

పైగా బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపిస్తుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం, పైగా ఆ పాత్ర కోసం బాలయ్య గుండు చేయించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Exit mobile version