తన నటనతో, డైలాగ్ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని బకాసుర టైటిల్ ర్యాప్ సాంగ్‌ను బ్లాక్‌బస్టర్ మాస్ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ర్యాప్ సింగర్ రోల్ రైడ్, వికాస బడిస ఆలపించారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ” బకాసుర రెస్టారెంట్ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్ నాకు మొదట్నుంచి తెలుసు. ప్రవీణ్ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలి. తొలి చిత్ర దర్శకుడు ఎస్‌జే శివతో పాటు అందరికి ఈ చిత్రం మంచి పేరును తీసుకరావాలి’ అన్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ” హంగర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందిఅతి త్వరలో చిత్ర విడుదల తేదిని ప్రకటిస్తాం. అనిల్ రావిపూడి గారు మా సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది’ అన్నారు.