బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణం’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, అందాల భామ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అవగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ లభించింది.
అయితే, ఇప్పుడు ఈ రామాయణం చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని నితీష్ తివారి తొలుత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని భావించాడట. దాని కోసం ఆయన మహేష్‌ను అప్రోచ్ కూడా అయినట్లు తెలుస్తోంది. మహేష్ అప్పటికే ఎస్ఎస్.రాజమౌళికి ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయాడని తెలుస్తోంది.
ఇలా రాజమౌళి సినిమా కారణంగా మహేష్ బాబు రామాయణం వంటి ఎపిక్ చిత్రాన్ని మిస్ చేసుకున్నాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామాయణం చిత్రంలో రావణాసురుడు పాత్రలో కన్నడ స్టార్ యష్ నటిస్తున్నాడు.