మంచు లక్ష్మీ నిర్మాతగా మరియు తను నటిస్తున్న చిత్రం ‘గుండెల్లో గోదారి’. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన రీ రికార్డింగ్ పనులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి అద్భతమైన నేపధ్య సంగీతాన్ని అందిస్తారని, దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఈ చిత్ర టీం తెలిపారు. ఇప్పటివరకూ మోడ్రన్ గా కనిపించిన లక్ష్మీ మంచు ఈ చిత్రంలో చిత్ర అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషిస్తోంది. లక్ష్మీ మంచుతో పాటు ఈ సినిమాలో ఆది, తాప్సీ మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ మొదట్లో రానున్న ఈ చిత్రం ద్వారా కుమార్ నాగేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 1986లో గోదావరిలో జరిగిన వరదల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.