జనవరి 16నుండి బాహుబలి సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది. ఈ సినిమా బృందం సంక్రాంతి సంబరాల కోసం చిన్న శెలవును తీసుకుంది. తిరిగి ఈరోజునుండి రామోజీ ఫిలిమ్ సిటిలో షూటింగ్ లో పాల్గొనుంది. “సెలవు అందరికీ నచ్చింది. రేపట్నుంచి మళ్ళీ పని/ యుద్ధం మొదలవనుంది” అని ట్వీట్ చేశాడు
ఈ నెల ప్రధామార్ధంలో ఈ సినిమాలో ప్రధానపాత్ర అయిన బాహుబలి కర్ణాటకకు చెందిన జైన గురువు గోమటేశ్వర ను పోలి వుండడమేకాక ట్రైలర్లలో వుండే హింస ద్వారా వారి జాతిని హింస ద్వారా కించపరుస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దానికి ఆయన స్పందిస్తూ
“మేము ఇప్పటివరకూ ఎటువంటి నోటీసులను ఎదుర్కొలేదు. గతంలో చెప్పిన్నట్టే ఈ కధకు గోమటేశ్వరకు ఎటువంటి సంబంధంలేదు” అని అన్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రధారులు. కీరవాణి సంగీత దర్శకుడు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్