బాహుబలి నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ – రాజమౌళి

బాహుబలి నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ – రాజమౌళి

Published on Jan 21, 2013 4:49 PM IST

rajmouli
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. రాజమౌళి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీయాలనుకుంటున్నారు. ఈ సినిమా తన కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా కానుందని రాజమౌళి తెలిపారు. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి సుమారు 70 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.

‘ఈగ’ సినిమాతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని భారీ ఎత్తున తీయనున్నారు. ఈ సినిమాని పలు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని పరిశీలిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం ప్రభాస్ బాడీ పెంచే పనిలో ఉన్నాడు.

తాజా వార్తలు