వి.ఎఫ్.ఎక్స్ లో కొత్త రికార్డు నెలకొల్పనున్న బాహుబలి

Bahubali
విజువల్ ఎఫ్ఫెక్ట్స్ నేపధ్యంలో రాజమౌళి తీస్తున్న బాహుబలి కొత్త రికార్డును సృష్టించనుంది. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి ప్రధానపాత్రధారులు. శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని ఈ సినిమాను ఆర్కమీడియావర్క్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతదర్శకుడు

గతంలో రాజమౌళి తీసిన ఈగ సినిమాలో 2234 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ తీశారు. ఇప్పటివరకూ తెలుగు సినిమాలో అన్నీ షాట్లను వాడిన ఏకైక సినిమాగా రికార్డు సృష్టించింది. కానీ ఈ బాహుబలి సినిమాలో 4500 – 5000 షాట్లను వాడనున్నారు. నిర్మాత కధనం ప్రకారం 90శాతం సినిమా మొత్తం కంప్యూటర్ లో చిత్రీకరించారు. “వి.ఎఫ్.ఎక్స్ కు సంబంధించినంత వరకూబాహుబలి అత్యంత బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా” అని తెలిపారు

వాస్తవంగా మాట్లాడితే రాజమౌళి గత సినిమాల బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ సినిమా గ్రాఫిక్స్ కి పెట్టె ఖర్చే ఎక్కువట. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా 2015లో మనముందుకు రానుంది

Exit mobile version