రెండు పార్ట్స్ గా రానున్న రాజమౌళి ‘బాహుబలి’

Bahubali
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘బాహుబలి’ రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కథ బాగా పరంగా మరియు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని రెండు పార్ట్స్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా మొత్తాన్ని ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు కానీ ఒక్కో పార్ట్ రిలీజ్ కి మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ప్రభాస్ కి తమ్ముడి పాత్రలో కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో రమ్య కృష్ణ, నాజర్, సత్యరాజ్ మొదలైన సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఆర్కా మీడియా బ్యానర్ వారు తెలుగు సినీ రంగంలోనే ఎవరూ నిర్మించనంత అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

Exit mobile version