ఐమాక్స్ ఫార్మాట్ లో ‘బాహుబలి’ ?

ఐమాక్స్ ఫార్మాట్ లో ‘బాహుబలి’ ?

Published on Jun 22, 2013 9:50 AM IST

Baahubali

ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పీరియడ్ డ్రామా సినిమా ‘బాహుబలి’. రాజమౌళి గారు ఎంతో ప్రతిస్తాత్మకంగా తీస్తున్న ఈ సినిమా గురించి మేము ఒక ఇంటరెస్టింగ్ విషయం వినడం జరిగింది. ఈ సినిమాని ప్రొడక్షన్ టీం ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. నిజంగా ఈ సినిమాని ఐమాక్స్ ఫార్మాట్ లో నిర్మిస్తే తెలుగులో ఐమాక్స్ ఫార్మాట్ లో నిర్మించిన ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషినల్ ఆడియన్స్ మనసును కూడా దోచుకోవడానికి రాజమౌళి, ఆయన టీం ప్రయత్నిస్తున్నారని ఈ తాజా సమాచారం వింటుంటే అనిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుపాటి లు ప్రదానంగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. అర్క మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. సెంథిల్ కెమెరా వర్క్ అందిస్తున్నారు.

తాజా వార్తలు