త్వరలోనే కేరళకి వెళ్లనున్న బాహుబలి టీం

త్వరలోనే కేరళకి వెళ్లనున్న బాహుబలి టీం

Published on Nov 6, 2013 1:20 PM IST

bahubali-first-look

సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పీరియాడికల్ డ్రామా ‘బాహుబలి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ నేటితో(నవంబర్ 6) ముగియనుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో కేరళలో ప్రారంభం కానుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వారియర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ప్రభాస్ కి బ్రదర్ గా కనపడనున్నాడు. అనుష్క హీరోయిన్ గా కనిపించనుంది. రేపు అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఎ స్పెషల్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేయనున్నారు.

‘బాహుబలి’ సినిమా 2015 లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు