‘బాహుబలి’ సమాచారాన్ని వీడియోల ద్వారా విడుదలచేయడానికి ప్లాన్

‘బాహుబలి’ సమాచారాన్ని వీడియోల ద్వారా విడుదలచేయడానికి ప్లాన్

Published on Nov 15, 2013 9:07 AM IST

bahubali-first-look

బాహుబలి ప్రొడక్షన్ టీం అభిమానుల కోసం, సినీ లవర్స్ ఒక కొత్త ఆలోచనలను చేస్తోంది. ఈ సినిమా నిర్వహణ టీం ఈ సినిమాకు సంబందించిన సమాచారాన్ని గత కొద్ది నెలల వరకు వీడియోల ద్వారా అభిమానులకు తెలియజేయాలని చూస్తోంది. ఈ వీడియోలతో ఈ సినిమాలోని కొన్ని అంశాలను ప్రేక్షకులకు తెలియజేయాలని భావిస్తోంది. ఇప్పుడు వారు ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు సంబందించిన వీడియోని విడుదల చేయలనుకుంటున్నారు. ఈ వీడియోలో కత్తి తయారు చేసిన విదానం గురించి, అలాగే వారి మనసులో ఏముంది అనే దానిని ఈ వీడియో ద్వారా చూపించనున్నారు. అలాగే వివిధ రకాల అంశాల గురించి కూడా ప్రొడక్షన్ టీం ఈ వీడియోలో తెలుపనుంది. ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళ లో జరుగుతోంది. ఈ సినిమా ప్రభాస్, రానా, అనుష్క లు ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమాని ఆర్క మీడియా నిర్మిస్తోంది.

తాజా వార్తలు