మొదలైన బాహుబలి సెకండ్ షెడ్యూల్

మొదలైన బాహుబలి సెకండ్ షెడ్యూల్

Published on Aug 12, 2013 3:30 PM IST

Bahubali

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమోఉలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘బాహుబలి’. ఈ సినిమాకి సంబందించిన సెకండ్ షెడ్యూల్ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. రానా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రభాస్ కి బ్రదర్ గా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా ఇండియాలోనే ఏ సినిమా తెరకక్కనంత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు