‘బాహుబలి 2’కి మూడేళ్లు.. ఎమోషనలైన ప్రభాస్, రానా !

‘బాహుబలి 2’కి మూడేళ్లు.. ఎమోషనలైన ప్రభాస్, రానా !

Published on Apr 28, 2020 8:34 PM IST

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రానా విలన్ గా వచ్చిన బాహుబలి 2 సృష్టించిన ఆల్ టైం రికార్డ్స్ గురించి తెలిసిందే. కాగా ఏప్రిల్ 28, 2017న విడుద‌లైన రాజమౌళి విజువల్ వండర్ కి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం పాన్ ఇండియన్ సినిమాగా సూపర్ హాట్ అయింది. పైగా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజ‌యం సాధించి అంద‌రి దృష్టి తెలుగు ప‌రిశ్ర‌మ వైపు చూసేలా చేసింది.

ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా ఈ సినిమానే ఉంది. అలాగే డిజిటల్ యుగంలో మన దేశంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన చిత్రంగా కూడా బాహుబలి 2నే ఉండటం విశేషం. ఇక బాహుబలి-2 విడుదలై మూడేళ్ళు అయిన సందర్భంగా రానా ప్రభాస్ తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ.. ‘ఈ ఫొటోనే మా ఆనందాన్ని చెబుతుంది. మహా శక్తిమంతమైన బాహుబలి-2కి మూడేళ్లు అని పోస్ట్ చేశారు.

ఇక ప్రభాస్ కూడా స్పందిస్తూ… ‘బాహుబలి 2 దేశం ప్రేమించిన సినిమా మాత్రమే కాదు, నా జీవితంలో అతిపెద్ద సినిమా కూడా. మ‌రచిపోలేని సినిమాని ఇచ్చిన రాజమౌళితో పాటు అభిమాలందరికీ నా ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు. బాహుబలి 2 మూడేళ్ళు పూర్తి చేసుకుంది . మీరు చూపించే ప్రేమలకు నేను ఎంత‌గానో సంతోషిస్తున్నాను అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు