జూన్ ఒకటి నుండి “బాద్షా” చిత్రీకరణ

జూన్ ఒకటి నుండి “బాద్షా” చిత్రీకరణ

Published on May 15, 2012 12:27 AM IST


యంగ్ టైగర్ ఎన్టీయార్ కామెడి ఎంటర్టైనర్ “బాద్షా” జూన్ ఒకటి నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. ఈ చిత్రీకరణ నిర్విరామంగా ఆరు నుండి ఏడు వారాల వరకు ఇటలిలో జరుపుకోనుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు ఎన్టీయార్ నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీను తనదయిన శైలి లో తెరకేక్కిస్తారని ఎన్టీయార్ నమ్ముతున్నారు, ఇటీవల ఈ చిత్రం సంగీత చర్చలు ఊటీ లో తమన్ తో జరిగాయి. ఈ చిత్రానికి తమన్ మంచి పాటలు అందించినట్టు సమాచారం. మొదటిసారిగా ఎన్టీయార్ శ్రీను కలిసి పని చేస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు