‘బాద్షా’ చిత్రంలో ఉపయోగించనున్న కొత్త టెక్నాలజీ

‘బాద్షా’ చిత్రంలో ఉపయోగించనున్న కొత్త టెక్నాలజీ

Published on Aug 26, 2012 4:44 PM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని 2013 జనవరిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారు.

పరమేశ్వర ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేష్ ‘బాద్షా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాంకేతిక విలువలు పరంగా చాలా ఉన్నతంగా ఉండాలని మరియు ఫీల్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బండ్ల గణేష్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడి ఎంటర్టైనర్ చిత్రంలో బ్రహ్మానందం ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు