ఈ వారం బాద్శాకి బిగ్ అడ్వాంటేజ్

Baadshah-21

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ మూవీకి ఈ వారం మేజర్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు , ఎందుకంటే గురువారం ‘ఉగాది’ , అలాగే 13న రెండవ శనివారం కావడంతో యు.ఎస్ లో 13, 14 తేదీల్లో కూడా కలెక్షన్స్ కి ఏమాత్రం డోఖా ఉండదని అంచనా వేస్తున్నారు. యుఎస్ మార్కెట్లో ఆల్ టైం ది బెస్ట్ తెలుగు సినిమా గ్రాసర్స్ లో ‘బాద్షా’ ఒకటిగా చేరే అవకాశం ఉంది.

ఈ సినిమాలో అదిరిపోయే కామెడీ ఎక్కువగా ఉన్నందున అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్.టి.ఆర్ బ్రహ్మానందంతో కలిసి సెకండాఫ్ లో పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. ఫస్ట్ హాఫ్ లో బంతి ఫిలాసఫీ తో కాజల్ బాగా నవ్వించింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. థమన్ సంగీతాన్ని అందించాడు.

Exit mobile version