ఎన్.టి.ఆర్ బాద్షా టోటల్ రన్ టైం..

ఎన్.టి.ఆర్ బాద్షా టోటల్ రన్ టైం..

Published on Apr 2, 2013 1:35 AM IST

Baadshah9
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమా ఎడిటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ మూవీ నిడివి 2గంటల 35నిముషాలకు ఫిక్స్ చేసారు. ఈ సినిమా రీ – రికార్డింగ్ కూడా దాదాపుగా చివరిదశలో ఉంది. ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించాడు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కాజల్ అగార్వాల్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, అజయ్, నవదీప్, ముకేష్ రిషి మొదలగు వారు నటి. ఈ సినిమా చాలా ఫాస్ట్ గా ఉండే ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని సమాచారం. డైరెక్టర్ శ్రీను వైట్ల ఎన్.టి.ఆర్ మాస్ అబిమానులకు తగినట్టుగా, కామెడీ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదిస్తుందని భావిస్తున్నారు.

తాజా వార్తలు