ఆంధ్రాలోనే కాక ఓవర్సీస్ లో కుడా ‘బాద్ షా’ తన ప్రతాపం చూపిస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో మొదటివారం వసూళ్ళు ఎన్.టి.ఆర్ సినీ ప్రస్తానంలోనే కొత్త రికార్డులను సృష్టించాయి. అమెరికా డిస్ట్రిబ్యుటర్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ‘బాద్ షా’ మొదటివారం 1.094 మిలియన్ డాలర్లు సంపాదించిపెట్టింది. ఈ వాటా అమెరికా చరిత్రలోనే రెండో అతి పెద్ద కలెక్షన్ అట. ఎన్.టి.ఆర్ కెరీర్ కు మాత్రం ఇదే మొదటి స్థానం. శ్రీను వైట్ల బ్రాండ్, ఎన్.టి.ఆర్ కొత్త లుక్ సినిమాకు మొదట్నుంచి భారీ అంచనాలను అందించింది. మరికొన్ని రోజులు ఈ ప్రభంజనం ఇలాగే ఉండొచ్చని, మొత్తం సినిమా కలెక్షన్స్ మాత్రం చిత్రం లాంగ్ రన్ పై ఆధారిపడి ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఎన్.టి.ఆర్, కాజల్ హీరో హీరోయిన్స్. ఎం. ఎస్ నారాయణ, బ్రహ్మానందం కామెడి పండించారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు.