చివరి దశలో బాద్ షా పోస్ట్ ప్రొడక్షన్

చివరి దశలో బాద్ షా పోస్ట్ ప్రొడక్షన్

Published on Apr 1, 2013 11:40 PM IST

Baadshah-21
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘బాద్ షా’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమా మార్చి29న సెన్సార్ దృవీకరణ కొరకు సిద్దమవుతుంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలకానుంది. డబ్బింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ చిత్రం యొక్క డి.ఐ బ్రహ్మాండంగా రావడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత బండ్ల గణేష్ లే స్వయంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ పనులు కధా రచయితలు గోపి మోహన్ మరియు కోనా వెంకట్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ కనిపించనుంది. థమన్ సంగీతం అందించాడు. ఎన్.టి.ఆర్ కెరీర్లోనే ‘బాద్ షా’ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.

తాజా వార్తలు