ఎన్టీఆర్ రాబోతున్న చిత్రం “బాద్షా” చిత్రీకరణ నిన్న మిలాన్ లో మొదలుపెట్టుకుంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరియు కాజల్ మధ్యన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం ఇటలీ మొత్తం పలు ప్రదేశాలలో రాబోయే 25 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనుంది. ఇండియా తిరిగి వచ్చాక ఈ చిత్ర బృందం మరొక పొడవయిన షెడ్యూల్ కోసం బ్యాంకాక్ పయనమవనుంది.శ్రీను వైట్ల మొట్ట మొదటి సారిగా ఎన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ కాంబినేషన్ ఒక ఎత్తయితే శ్రీను వైట్ల ఈ మధ్యనే “దూకుడు” చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వటం ఈ చిత్రం మీద మరిన్ని అంచనాలను పెంచుతుంది.గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ ఈ చిత్రానికి కథను అందించారు. బాద్షా చిత్రం పూర్తి వినోదాత్మకమయిన యాక్షన్ చిత్రంగా ఉండబోతుంది.