యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన బాద్షా సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి అబిమనుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఉగాది పండుగా, వేసవి సెలవులు కావడంతో ఈ వారాంతంలో కలెక్షన్లు భారీగా పెరిగాయి. దీనితో ఈ సినిమా కొత్త రికార్డు సృష్టిస్తుందని అందరు భావిస్తున్నారు. విదేశాలలో కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ, ఎన్.టి.ఆర్ తెరపై నటించిన తీరు ఈ సినిమా సక్సెస్ కు కారణం అయ్యాయని చెప్పాలి. ఇప్పటికి ఎ, బి, సి సెంటర్స్ లో జనం ఈ సినిమాకోసం వేచిఉండవలసి వస్తోంది. దీనివల్ల ఈ వారం విడుదల కావాల్సిన భారి బడ్జెట్ సినిమాలను వచ్చే వారం విడుదల చేయనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడుక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించాడు.