గన్స్, గోల్డ్, హంట్: క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’లో కొత్త పాయింట్ – చిరపుంజిలో ఛాలెంజింగ్ షూట్!

ప్రముఖ నిర్మాత వేణు దోనేపూడి నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’ షూటింగ్ మేఘాలయలో శరవేగంగా జరుగుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్‌లో మొదలైంది. టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, విష్ణు ఓ అయ్, కార్తికేయ దేవ్, కశ్యప్, విస్మయ, మాల్వి మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మేఘాలయలో పూర్తిగా షూటింగ్ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఒకే రోజులో జరిగే కథాంశంతో, ఆరుగురు పాత్రల చుట్టూ గన్స్, గోల్డ్, హంట్ నేపథ్యంతో ఈ ఆసక్తికర కథనం సాగుతుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో కథ సెట్ అయినందున, మేఘాలయలోని జలపాతాలు, కొండల వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నామని నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. కథకు అనుగుణంగా ఇక్కడి వాతావరణం సరిగ్గా సరిపోయిందని ఆయన అన్నారు.

ఎప్పుడూ వర్షం కురిసే సోహ్రా (చిరపుంజి) ప్రాంతంలో షూటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నదైనా, తక్కువ లైటింగ్ వంటి ఇబ్బందులను అధిగమిస్తూ తమ బృందం కష్టపడుతోందని వేణు చెప్పారు. తమ టీమ్ కృషి చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్రాలయం స్టూడియోస్ ఈ సినిమా కోసం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ఇటీవల సినిమా యూనిట్‌ను కలిసిన ముఖ్యమంత్రి కన్రాడ్ కె. సంగ్మా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కొత్త దర్శకుడు గుణి మాచికంటిని ఈ సినిమాతో చిత్రాలయం స్టూడియోస్ పరిచయం చేస్తోంది.

Exit mobile version