సౌత్ ఈస్ట్ ఏసియాలోనే అతిపెద్ద మోషన్ పిక్చర్ స్టూడియో విజయ-వాహిని అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. తెలుగు సినిమా యొక్క చరిత్రని స్మరించినప్పుడు తప్పక తలవాల్సిన పేర్లలో ఆయన ఒకరు. ఆయన చేసిన కృషిని స్మరిస్తూ క్రిందటి యేటి నుండీ ఆయన పేరు మీద బి. నాగిరెడ్డి అవార్డును ప్రధానం చెయ్యడం జరుగుతుంది. ఈ యేడాది ఆ అవార్డును టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను వరించింది. తన ఊహను ఒక కళాఖండంగా తీర్చిదిద్ది అద్బుతమైన సినిమాను మనకు అందించారు. ‘ఈగ’ ఇదివరకే రెండు జాతీయ అవార్డులను సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.