“ఓజి” ఓఎస్టీ.. డేట్, సర్ప్రైజ్ కూడా

og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ చిత్రమే ఓజి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కొడితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ మూమెంట్స్ లో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన స్కోర్ ఇంకా పాటలు కూడా ఒకటి. తన మ్యూజిక్ కి ఏకంగా గ్లోబల్ రీచ్ కూడ వచ్చింది. ఇలా దుమ్ము లేపిన థమన్ వర్క్ ఇప్పుడు ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) ని తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశాడు.

అయితే ఈ నవంబర్ నెల మొదలవుతుండడం తోనే థమన్ సాలిడ్ అప్డేట్ అందించాడు. దీనితో ఓఎస్టీ డేట్ అందిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. అంతేకాకుండా ఓ సర్ప్రైజ్ కూడా ఉందని కన్ఫర్మ్ చేశాడు. ఇక ఈ డేట్ అండ్ సర్ప్రైజ్ కోసం అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version