అగ్లీ స్టోరీ’ టీజర్: నందు, అవికా గోర్ లీడ్ రోల్స్‌లో ఇంటెన్స్ లవ్ స్టోరీ

నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ చిత్రం నుంచి దసరా సందర్భంగా ఇంటెన్స్ టీజర్ విడుదలైంది. రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ‘హే ప్రియతమా’ లిరికల్ సాంగ్ మంచి స్పందన పొందాయి.

టీజర్‌లో నందును ఒక పర్వర్ట్ క్యారెక్టర్‌గా పరిచయం చేశారు. అవికా గోర్ మరొకరిని ప్రేమించినా, నందు ఆమెను వదలక వేధిస్తాడు. “వాళ్ళది ప్రేమ, అందుకే కలిసుకున్నారు. నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్” అనే డైలాగ్ నేపథ్యంలో అవికా గోర్ – రవితేజ మహాదాస్యం పెళ్లి, మెంటల్ ఆస్పత్రిలో నందు దృశ్యాలు కథలోని ట్విస్టులను సూచిస్తున్నాయి. చివర్లో నందు కన్నీళ్లు పెట్టుకోవడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో శివాజీ రాజా, రవితేజ మహాదాస్యం, ప్రజ్ఞ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, శ్రీకాంత్ పట్నాయక్, సోమ మిథున్ ఎడిటింగ్, విఠల్ కోసనం ఆర్ట్ డైరెక్షన్ ఈ ప్రాజెక్ట్‌కు బలాన్ని చేకూర్చాయి.

Click Here For Video

Exit mobile version