‘అవతార్’ కోసం ఇండియాలో ఇంత క్రేజా..?

Avatar-Fire-and-Ash

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ సిరీస్ చిత్రం ‘అవతార్’ వరల్డ్‌వైడ్‌గా ఎలాంటి క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. రెండు కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సిరీస్‌లో రానున్న మూడో సినిమా కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమా కోసం ఇండియన్ ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. దీనికి నిదర్శనంగా ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమాకు ఏకంగా 1.2 మిలియన్ మంది ప్రేక్షకులు తమ ఇంట్రెస్ట్‌ను కనబరిచారు.

ఈ లెక్కన ఈ క్రేజీ చిత్రం రిలీజ్ తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 19న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Exit mobile version